కదిరిబాబురావు కళాశాల విద్యార్థులు రూడ్ సెట్ సంస్థ సందర్శన:
సిఎస్ పురం,మేజర్ న్యూస్,,మండలంలోని కదిరిబాబురావు వ్యవసాయ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ అభ్యసనలో భాగంగా శుక్రవారం ఒంగోలులోని గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణా సంస్థ(రూడ్ సెట్ సంస్థ) కేంద్రాన్ని సందర్శించారు.ఈసందర్భంగా అధికారులు రూడ్ సంస్థ లక్ష్యాలను పనితీరు ఉపాధి శిక్షణ, వ్యవస్థాపక శిక్షణ శరణార్ధుల ఎంపిక,వివిధ సంస్థల గుర్తింపు అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఆర్ధిక సహాయం వ్యాపార ప్రణాళికల తయారీ చేయు విధానం మార్కెటింగ్ మద్దతు గురించి విద్యార్థులకు వివరించారు.అంతేకాకుండా నాబార్డ్ డిడియం, అగ్రి క్లినిక్ లు,అగ్రి వ్యాపార సంస్థల పధకం గురించి వివరించి వ్యవసాయ పట్టభద్రులను ప్రోత్సహించడంలోను ఉపాధి అవకాశాలు కల్పించడంలో రూడ్ సంస్థ అందిస్తున్న సేవలు వివరించి వ్యవసాయ విద్యార్ధులు ఉన్నత రంగంలో రాణించడానికి రూడ్ సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. ఈకార్యక్రమంలో రూడ్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి,లీడ్ జిల్లామేనేజర్ డి.రమేష్,కెనరా బ్యాంకు మేనేజర్ కె.రవికుమార్, నాబార్డ్ అధికారులు, కళాశాల అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బసవరాజు,సిహెచ్.స్నేహ,విద్యార్థులు పాల్గొన్నారు.