BREAKING
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తపస్ హైస్కూల్ విద్యార్థులు అడ్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని

తవ్వారు.... వదిలేశారు

Select Suryaa Now
తవ్వారు.... వదిలేశారు

*తొవ్వారు.. వదిలేశారు*

పట్టించుకోని గ్రామ సర్పంచ్, అధికారులు

 

డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం తవ్వకాలు చేపట్టి అలాగే వదిలిపెట్టడంతో డ్రైనేజీ నుంచి వచ్చే  ఈగల, దోమలతో దుర్వాసనతో, ప్రజలు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం సోషల్ మీడియాలో ప్రచారం సంఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని చింతపట్ల, గ్రామంలోని 10వ వార్డులో ఎస్సీ కాలనీలో నెల రోజుల క్రితం అండర్ డ్రైనేజీ జామ్ కావడంతో, డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం తవ్వకాలు చేపట్టారు. కానీ పనులు పూర్తి చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తవ్విన ప్రాంతాన్ని అలాగే వదిలేయడంతో అటుగా రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నామని దుర్వాసన ఈగల దోమలతో రోగాల బారిన వస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామ సర్పంచ్ తొట్ట రమేష్, గ్రామ సెక్రెటరీ రవికుమార్ రెడ్డి డ్రైనేజ్ సమస్యలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరిస్తే వాడలోని ప్రజలకు ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కొండ్రు శివ... యాచారం సూర్య రిపోర్టర్