పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తపస్ హైస్కూల్ విద్యార్థులు
జంగారెడ్డిగూడెం- సూర్య న్యూస్ న్యూస్జంగారెడ్డిగూడెంలోని తపస్ హైస్కూల్‌కు చెందిన 6జ్ 9వ తరగతి విద్యార్థులు శనివారం విద్యా విజ్ఞాన యాత్రలో భాగంగా పోలవరం జాతీయ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని స్పిల్‌వే, సొరంగాలు, జలవిద్యుత్ ఉత్పత్తి విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు.సాగునీటి అవసరాలు, నీటి నిర్వహణ, ప్రాజెక్టు నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి, ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ చిరంజీవి విద్యార్థులకు వివరించారు. ప్రాజెక్టు ద్వారా సుమారు 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేసే విధానంపై అవగాహన కల్పించారు.పాఠ్యపుస్తకాల్లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెరిగిందని పాఠశాల డైరెక్టర్ బుద్దాల సురేష్ తెలిపారు. విద్యార్థుల్లో ప్రాయోగిక అవగాహన, పరిశీలనా దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇటువంటి విద్యా పర్యటనలు నిర్వహిస్తున్నామని అకడమిక్ డైరెక్టర్ జి. ఆదిత్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ కెవి రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,