BREAKING
నోబెల్ శాంతి బహుమతులు తనకు ఎనిమిది పురస్కారాలు రావాలన్న డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: ఈ నెల 14 లేదా 15న నోటిఫికేషన్ విడుదల! బంగ్లాదేశ్‌లో వైభవంగా మహాలయ వేడుకలు దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు! జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు?

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా  ప్రజా దర్బార్

చీపురుపల్లి, సూర్య : చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో  ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు శుక్రవారం తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఎమ్మెల్యే  స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి మొత్తం 45 వినతులను స్వీకరించారు.
ప్రధానంగా విద్యుత్, డ్రైనేజీ, భూ సమస్యలు, రహదారులు, తాగునీరు, పింఛన్లు, సంక్షేమ పథకాలు తదితర సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే కి వినతులు అందజేశారు. ప్రతి వినతిని పరిశీలించి  సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే  తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం అయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తామని ఎమ్మెల్యే కళా వెంకటరావు పేర్కొన్నారు.

 

రిపోర్టర్ : మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా.