BREAKING
స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్, ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* కేంద్ర సీఇసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి.. రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ ఘనంగా విశిష్ట విద్య ప్రదాత పురస్కారం నేరాల నియంత్రణ, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్. సి. ఐ నాగమల్లేశ్వరరావు. పొన్నూరులో రెవెన్యూ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సమీక్ష గీతంలో డా.ఎమ్.వి.వి.ఎస్ మూర్తి మూట్‌కోర్టు పోటీల ముగింపు ... విజేతగా సింబయాసిస్ న్యాయ విశ్వవిద్యాలయం రైతుబజార్ లో కమర్షియల్ షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానం! త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట మైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి* పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలి ఆర్డీవో చిన్నయ్య నూతనకల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జనసేనలోకి 60 కుటుంబాల యువత చేరిక నోబుల్ అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అగ్రహం -- తక్షణమే నోబుల్ ని విడుదల చేయాలని నాయకుల డిమాండ్ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలి వివేకానంద స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మాజీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంభంగి

బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత నైతం కృష్ణారావుకు ఘన సన్మానం

Select Suryaa Now
బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత నైతం కృష్ణారావుకు ఘన సన్మానం

అంకితభావానికి దక్కిన గుర్తింపు.. - తిర్యాణికి గర్వకారణం విద్యార్థి సంఘం మండల ఉపాధ్యక్షుడు రాయి సీడం గంగు

 సూర్య తిర్యాణి : తిర్యాణి, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయుడు నైతం కృష్ణారావుకు బెస్ట్ టీచర్ అవార్డు–2026 లభించడం తిర్యాణి మండలానికి గర్వకారణమని విద్యార్థి సంఘం మండల ఉపాధ్యక్షుడు రాయి సీడం గంగు అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గంగు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తిపట్ల నిబద్ధతతో, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా సేవలందిస్తున్న కృష్ణారావుకు ఈ అవార్డు రావడం సంతోషకరమన్నారు. ఆయన అంకితభావానికి, విద్యా సేవలకు దక్కిన గుర్తింపుగా ఈ పురస్కారం నిలుస్తుందని పేర్కొన్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించే ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవని అన్నారు. అటువంటి సేవలను గుర్తించి గౌరవించడం అభినందనీయమని, కృష్ణారావు సాధించిన ఘనత ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయి సీడం గంగు, ఉమ్మడి మంగి గ్రామపంచాయతీ కోశాధికారి కోట్నాక రాంషా, గిన్నెదరి సర్పంచ్ వెడ్మ నరేష్, గుండాల సర్పంచ్ ఆడ సోము పాల్గొన్నారు.