ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్
లక్కవరపు కోట, సూర్య : ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యేకు స్వయంగా వివరించి అర్జీలు సమర్పించారు.
ఈ ప్రజాదర్బార్‌లో మొత్తం 10 శాఖలకు సంబంధించి 19 వినతులు అందాయి. ఇందులో అత్యధికంగా వ్యవసాయ శాఖకు సంబంధించి 6 అర్జీలు రాగా, పంచాయతీరాజ్ శాఖకు 3, గృహనిర్మాణ శాఖకు 2, పింఛన్లకు సంబంధించి 2 దరఖాస్తులు నమోదయ్యాయి. వీటితో పాటు గ్రామ/వార్డు సచివాలయాల శాఖ (SGSW), దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ, విద్యా శాఖ, సెర్ప్ (SERP), రెవెన్యూ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు ఎమ్మెల్యేకు సమర్పించారు.
ప్రజల నుంచి అందిన అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, వాటిని వెంటనే సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేసి గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : గోవింద్, ఎల్ కోట, విజయనగరం జిల్లా.