గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలి
గుంతల రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
ఇరుకైన రహదారులను విస్తరించి రవాణా సౌకర్యం కల్పించాలి.డిప్యూటీ కమీషనర్ కు బీజేపీ నేతల వినతి.
ఆదిభట్ల సర్కిల్ తుర్కయాంజల్ గ్రామంలో దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని జిహెచ్ఎంసి 53, 56 డివిజనుల బీజేపీ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహారెడ్డి కోరారు.ఇరుకైన రహదారుల కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని, విద్యార్థులు, వృద్ధులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారని తెలిపారు.సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆదిభట్ల సర్కిల్ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమీషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.దెబ్బతిన్న రోడ్లకు అత్యవసర మరమ్మతులు చేపట్టడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో రహదారులను విస్తరించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.సమస్యను పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బచ్చిగళ్ళ రమేష్, తూల నరసింహ గౌడ్, కొత్త రాం రెడ్డి,కాంచినాని దాసు, గుండా కృష్ణ, మైలారం బాబు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెంకటేష్ గౌడ్ :మేజర్ న్యూస్, తుర్కయంజాల్