సూర్య జైనూర్: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త, నాయకుడికి పార్టీ గుర్తింపు ఇస్తుందని, పదవులు రావడంతో నాయకులపై మరింత బాధ్యత పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జైనూర్ మండల అధ్యక్షుడు షేక్ రషీద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమత విశ్వనాథరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుద్దాల శ్రీనివాస్ అన్నారు. గురువారం జైనూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన కార్యవర్గాల్లో నియమితులైన నాయకులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గంతో పాటు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కిసాన్ సెల్, మహిళా విభాగం, యువజన విభాగం, మీడియా విభాగాలకు నూతన కార్యవర్గాలను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా చైర్మన్ అర్షద్ హుస్సేన్ ప్రకటించారు. మండల ఉపాధ్యక్షుడిగా కోట్నాక దౌలత్రావు, ప్రధాన కార్యదర్శిగా కోటేష్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడిగా కొమరం భుజంగరావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడిగా దండవుల మహేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా భూతాలే కిరణ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా దుర్వాసందు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడిగా మెస్రం జంగు, సేవాదళ్ మండల అధ్యక్షుడిగా చవాన్ విక్రమ్, మండల యువజన అధ్యక్షుడిగా కోవా సిద్దు, మీడియా కోఆర్డినేటర్‌గా సయ్యద్ సాబీర్ నియమితులయ్యారు.
మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడిగా షేక్ అబ్బు, ఉపాధ్యక్షులుగా షఫిక్ అన్సారి, సయ్యద్ సజ్జాద్ అలీ, స్పోక్స్‌పర్సన్‌గా మజార్ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా షేక్ షాకీర్, సయ్యద్ గులాబ్, షేక్ అబ్దుల్, షేక్ వసీం, షేక్ మహబూబ్, షేక్ రహీం, కార్యదర్శులుగా షేక్ తాజు, షేక్ అజీమ్, షేక్ చంద్, సయ్యద్ సాబీర్, షేక్ సమీర్, షేక్ ఖలీల్, షేక్ ఇసాక్, షేక్ సాహిల్, షేక్ ఇర్ఫాన్, షేక్ మసీద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గ సభ్యులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన పదవులు పొందిన నాయకులకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.