కాలేజీ రోడ్డులో రెడీమిక్స్ లారీల నిర్లక్ష్యంపై కార్పొరేషన్ సమావేశంలో ఫిర్యాదు విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరిన బీజేపీ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు
సూర్య మంచిర్యాల టౌన్ : కాలేజీ రోడ్డులో రెడీమిక్స్ లారీలు నిర్లక్ష్యంగా రాకపోకలు సాగిస్తూ రహదారిపై కంకర, రెడీమిక్స్ మిశ్రమాన్ని చిందించడం వల్ల విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు తెలిపారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.ఈ విషయాన్ని కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, రెడీమిక్స్ లారీలపై నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు.రహదారులపై నిర్మాణ సామగ్రి చిందకుండా చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మేయర్, కమిషనర్ వెంటనే సంబంధిత ఎంఆర్‌ఓకు సమాచారం అందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కుక్కలు, దోమల సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
అదేవిధంగా పట్టణంలో పెరుగుతున్న వీధి కుక్కలు, దోమల సమస్యను కూడా కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీధి కుక్కల నియంత్రణతో పాటు దోమల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.బతుకమ్మ, దసరాకు ముందస్తు ఏర్పాట్లు తెలంగాణ ప్రజల ప్రధాన పండుగలైన బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.పండుగల నేపథ్యంలో పారిశుధ్యం, దోమల నివారణ, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.పండుగల సమయంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని కౌన్సిల్ సమావేశంలో విజ్ఞప్తి చేశారు.