BREAKING
టీబీ నిర్మూలనలో కాల్వపల్లి భేష్ ఏపీ పోర్టుల అభివృద్ధిపై మహారాష్ట్ర మంత్రి నితేష్ అధ్యయనం: మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డితో భేటీ సురేష్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి..... ఉపాధి పనుల్లో జాప్యం వద్దు. పీడీ సలీం. ‘బిల్డ్ ఏపీ’ మా ప్రభుత్వ నినాదం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి - జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వి.రాములు పవన్ కళ్యాణ్ ఆశయాలే స్ఫూర్తిగా జనసేనలో యువత చేరికలు ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభతరం • వాట్సాప్‌ ద్వారా నేరుగా ఫిర్యాదులు చేసుకునే అవకాశం • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి • 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం • జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య కొత్తపట్నంలో రూ. 44.25 కోట్లతో 132/33 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభం: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు: 52 వారాల కనిష్టానికి పడిపోయిన నిఫ్టీ! గన్నవరం మాజీ సీఐ అహ్మద్ అలీ పెద్దకర్మ. నివాళులర్పించిన ప్రముఖులు, విలేకరులు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు: పోలవరం పనుల్లో గణనీయమైన పురోగతి! ప్రమాదపుటంచున  కరెంటు స్తంభం.... పట్టించుకునే నాధుడు లేడు....ప్రమాదం జరిగితే భారీ నష్టం

సేవా సేతు అభియాన్‌పై.. వినియోగదారులకు అవగాహన..

Select Suryaa Now
సేవా సేతు అభియాన్‌పై.. వినియోగదారులకు అవగాహన..

సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు బ్యాంకు రుణాలు   ఏడు రోజుల్లోపు సబ్సిడీ మొత్తాలు ఖాతాల్లో జమ   సోలార్ ప్రయోజనాలను ఇంటింటికీ వివరించాలి   జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్  పి. సుధాకర్

నెల్లూరు, వేదాయపాలెం, మేజర్ న్యూస్  :   నెల్లూరు టౌన్ డివిజన్ పరిధిలోని ఐఈ సెక్షన్ నందు సేవా సేతు అభియాన్ పథకంపై జిల్లా సూపరింటెంటింగ్ ఇంజనీరు పి సుధాకర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా  వినియోగదారులకు విద్యుత్ సేవలు, సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు మరియు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై వివరించారు. అనంతరం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. సుధాకర్ మాట్లాడుతూ.., సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు కోసం బ్యాంకులు సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నాయని, అలాగే ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ మొత్తాలు కూడా త్వరితగతిన లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు.  గరిష్టంగా 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ వ్యవస్థకు రూ.78,000 వరకు, 2 కిలోవాట్లకు రూ.60,000 వరకు, 1 కిలోవాట్ కు రూ.30,000 వరకు సబ్సిడీ లభిస్తుందని, అర్హత కలిగిన లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ మొత్తం వారం రోజులలోపు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.  సోలార్ విద్యుత్ వ్యవస్థల వల్ల వినియోగదారులకు విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రయోజనాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ సిబ్బంది, O&M సిబ్బంది మరియు వెండర్లపై ఉందన్నారు.  ఓ అండ్ఎం సిబ్బంది తమ డిస్ట్రిబ్యూషన్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి వినియోగదారులకు సోలార్ విద్యుత్ వ్యవస్థల ప్రయోజనాలు, సబ్సిడీ వివరాలు మరియు దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు.  అలాగే విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది నిరంతరం పనిచేస్తారని తెలిపారు. సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించిన పనులను వెండర్లు కూడా వేగవంతంగా పూర్తి చేసేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్.. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్..అసిస్టెంట్ ఇంజనీర్లు.. జూనియర్ ఇంజనీర్లు..సిబ్బంది పాల్గొన్నారు.