అంగరంగవైభవంగా పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతర
పొదలకూరు, మేజర్ న్యూస్ : అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ కొమ్మి లక్ష్మయ్య నాయుడు, యువనాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతి జాతరకు విచ్చేసిన సోమిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం సత్కరించిన ఉత్సవ కమిటీ
పొదలకూరు శ్రీ పోలేరమ్మ తల్లికి 90 ఏళ్ల తర్వాత అత్యంత వైభవంగా జాతర నిర్వహించడం చాలా సంతోషంగా ఉంద నేను ఎమ్మెల్యేగా ఉన్న ఈ సమయంలోనే జాతర జరుగుతుండటం నా అదృష్టం అమ్మవారి ఆశీస్సుల కోసం వేలాదిగా భక్తులు తరలిరావడం ఆనందదాయకం భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీకి, అన్ని శాఖల అధికారులకు అభినందనలు ప్రజలందరినీ, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని అమ్మవారిని కోరుకున్నాను పొదలకూరు ప్రజలందరికీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు