లయన్స్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ప్రపంచ నేత్ర దినం
ప్రపంచ నేత్ర దినం (World Sight Day) సందర్భంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు అక్టోబర్ 8 నుండి 18 వరకు జరుగనున్న “విజన్ “ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మాంటిస్సోరి హై స్కూల్ లో విద్యార్థులకు దుర్గా కంటి హాస్పిటల్ సౌజన్యంతో నేత్ర పరీక్షలు నిర్వహించారు. 850 మంది విద్యార్థులు ఈ సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సిటిజెన్ అధ్యక్షులు లయన్ మామిడాల గిరినాథ్ కార్యదర్శి కసిబిసి నాగేశ్వర రావు మాంటిస్సోరి ప్రకాష్ డీవీ రాఘవ ప్రిన్సిపాల్ నూరుద్దీన్ దుర్గా కంటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు