ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఎన్నికల సంఘంపై విశ్వాసం పెంచాలి
గూడూరు, మేజర్‌న్యూస్ : ప్రజా స్వామ్యాన్న ఇకాపాడేందుకు ఎన్నికల సంఘంలో పారదర్శత పెచాల్సిన అవసరం ఉందని కాండ్రెగస్ నాయకులు పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులు, ఇండి కూటమి నాయకులతో కల్సి శాంతి యుతంగా నిరసన చేస్తుంటే పోలీసుల దురుసు ప్రవర్తన సిగ్గు చేటన్నారు. లాఠీచార్జ్ చేయడంతో పలువురు గాయపడిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకుడిపై, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులపై జరిగిన దాడి ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యానికి “బ్లాక్ డే”గా భావిస్తున్నట్లు తెలిపారు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల ప్రక్రియపై మరియు ఎన్నికల సంఘంపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం ఇన్‌చార్జి డాక్టర్ రామకృష్ణయ్య, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమయ్య, రాష్ట్ర ఐఎన్‌టియుసి అధ్యక్షుడు పూల చంద్రశేఖర్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు షేక్ ఫయాజ్, రాష్ట్ర కాంగ్రెస్ బిసి విభాగం కార్యదర్శి రావూరి బ్రహ్మయ్య, జిల్లా కాంగ్రెస్ బిసి విభాగం కార్యదర్శి గుంటమడుగు సుబరామరాజు ,గూడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుబ్బారావు, యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్, ముత్తుకూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంకయ్య, ఎపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి ,మూర్తి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.