నోట్.. సూర్య కథనానికి స్పందన...
ఆపరేషన్ రాపూరు అటవీశాఖ... ప్రక్షాళన దిశగా.. రేంజ్ ఆఫీసర్ అడుగులు.. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వర్క్ పై స్పెషల్ ఫోకస్... వైఫల్యాలపై సమగ్ర తనిఖీలు.. పరిశీలన.. వరుస సమీక్షలతో సిబ్బంది కి దిశా నిర్దేశిత మార్గదర్శకాలు.. వనరులు వృక్ష జీవవైవిద్య సంరక్షణకు పెద్ద పేట.. పూర్వ వైభవం కల్పించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ కార్యాచరణ... అక్రమ కలపాలపైడేగ కన్నుతో నిఘా...
నెల్లూరు, వేదాయపాలెం, మేజర్ న్యూస్ :
నిర్లక్ష్యపునీడలో రాపూరు అటవీ రేంజ్ పాలన అన్న శీర్షికన నేటి దినపత్రిక సూర్య లో పరిశోధిత కథనం ప్రచురిత మైన విషయం పాఠకులకు విధితమే.ఈ మేరకు సానుకూలంగా స్పందించిన స్థానిక క్షేత్రస్థాయి అధికారి జ్యోతిఆనంద్ ప్రత్యేక కార్యాచరణ అమలుతో ప్రక్షాళన దిశగా అడుగుల వేగం పెంచేందుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల రాపూరు రేంజ్ నూతన అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి ఆనంద్ సమర్ధుడైన అధికారి అయినప్పటికీ.. నూతనంగా బాధ్యతలు తలు స్వీకరించడంతో ఇక్కడి పరిస్థితులపై పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ..శాఖ పరమైన ప్రగతి సాధనను లక్ష్యంగా ఎంచుకొని అందుకు అనుగుణంగా రూపొందించుకున్న
కార్యాచరణ అమలులో భాగంగానే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వర్క్ పై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన (స్పెషల్ ఫోకస్)ఆయా సెక్షన్ల పరిధిలోని బీట్ ల వారిగా సందర్శనతో సమస్యలు.. వైఫల్యాండ్ గుర్తించే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. ఇదే క్రమంలో రాపూరు- చిట్వేల్ సరిహద్దు ప్రాంతం నుంచి రాపూరు పరిధిలోకి వచ్చే అటవీరిజర్వు ప్రాంతాల్లోని మూలాలు.. రహస్య మార్గాలు..నీటి నిల్వల ఆధారిత ప్రాంతాలు.. సహజ వనరులు..అరుదైన ఎర్రచందనం వృక్ష సంపద..వన్యప్రాణి ఆవాసాలను తమ సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఎర్రచందనం..
విలువైన మైనింగ్ ఖనిజ నిక్షేపాలు.. వన్యప్రాణి ఆధారిత ఆవాసాలకు నిలయమైన రేంజ్ కావడంతో ఎక్కడ కూడా రాజీ పడని ధోరణితో సమస్యలు తలెత్తకుండా చేయాలన్న లక్ష్యంతో ముందస్తు భద్రత చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే క్రమంలో వరుస సమీక్షల ద్వారాడిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు.. సెక్షన్ ఆఫీసర్లు.. బీట్.. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లను సమన్వయం చేసి క్షేత్రస్థాయిలో ప్రకృతి సంపద పరిరక్షణకు చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ పై దిశా నిర్దేశాలు చేస్తున్నారు. వెలుగొండ అటవీరిజర్వు ప్రాంతాల్లో సంచరించే అనుమానాస్పద వ్యక్తుల కదలికలు..ఇతర అసాంఘిక కార్యకలాపాలపై డేగ కన్నుతో నిఘా ముమ్మరం చేసే దిశగా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. సకల జీవరాసుల తోపాటు ప్రత్యేకించి మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణ సమతుల్యత పరిరక్షణలో కీలకభూమిక పోషిస్తున్న అడవుల సంరక్షణ యొక్క ఆవశ్యకతపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం ద్వారా చర్యలు తీసుకుంటున్నారు.అటవీ ఉద్యోగులు పనితీరు మార్చుకోవాలని.. అంకితభావ విధి నిర్వహణతో శాఖ పరమైన ప్రగతిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేయాలని సూచిస్తున్నారు ..నిర్లక్ష్యం.. బాధ్యతా రాహిత్యమైన పనితీరుతో ఎంతో ప్రాధాన్యత కలిగిన అటవీశాఖ అభివృద్ధి ప్రస్థానానికి భంగం వాటిల్లితే ఉపేక్షించే ప్రసక్తే ఉండబోదని..శాఖా పరమైనచర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
తనిఖీ కేంద్రాల వద్ద నిఘా ముమ్మరం... రాపూరు అటవీ రేంజ్ పరిధిలోని ప్రధాన కూడళ్ళు.. రహదారి మార్గాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉన్న అటవీ తనిఖీ కేంద్రాల వద్ద నిఘా ముమ్మరం చేస్తున్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందితోపాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆయా సెక్షన్..బీట్ స్థాయి ఉద్యోగులు అందుబాటులో ఉండే విధంగా రేంజ్ ఆఫీసర్ జ్యోతి ఆనంద్ చర్యలు తీసుకుంటున్నారు. ఆయా తనిఖీ కేంద్రాల మీదుగా రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదటనే అనుమతించాలని సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ విభాగం కూడా తమ వంతు విధి నిర్వహణతో సమర్థవంతంగా పనిచేయాలని.. ఎక్కడ కూడా ఆరోపణలకు అవకాశం ఉండకూడదని సూచిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం.. అటవీ ఉన్నతాధికారుల మార్గదర్శక ఆదేశాలను శిరోధార్యంగా భావిస్తూ క్షేత్రస్థాయిలో పనిచేసే అన్నిస్థాయిల ఉద్యోగు లందరినీ సమన్వయం చేస్తున్నామని..త్వరలోనే రాపూరు అటవీరేంజ్ పాలనకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా రేంజ్ఆఫీసర్ జ్యోతి ఆనంద్ తెలిపారు.