మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన జనసేన మల్లయ్య
మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
మంత్రి నాదెండ్ల మనోహర్ ను గురువారం ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆళ్ళగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మైలేరి సురేఖ ప్రమాణస్వీకారం చేయడానికి సంబంధించిన జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు ఆహార & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని తెనాలిలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.