BREAKING
బాలికల హక్కులకు భరోసా - బాల్య వివాహాల నిర్మూలనకు పిలుపు ---అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా షీ టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ సీట్లు - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డఫ్ పేట్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభాని గార్మి జండా మహోత్సవం కాపర్ వైర్ చోరీ కేసులో తమిళనాడుకు చెందిన ఇద్దరు అరెస్ట్‌! ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థులు రూడ్ సెట్ సంస్థ సందర్శన: బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత నైతం కృష్ణారావుకు ఘన సన్మానం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పడమటి నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అశ్వారావుపేటలో రాష్ట్ర స్థాయి అండర్‌–20 బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు హెడ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి తవ్వారు.... వదిలేశారు సమష్టి కృషితోనే మున్సిపల్‌ విజయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన చోలే నరేష్‌కు ఘన సన్మానం

Select Suryaa Now
ఎంబిబిఎస్ సీటు సాధించిన చోలే నరేష్‌కు ఘన సన్మానం
సూర్య జైనూర్: జైనూర్ మండల కేంద్రంలోని ఉస్మాన్స్ కేరళ గ్రామర్ పాఠశాల పూర్వ విద్యార్థి చోలే నరేష్ ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి ఎంబిబిఎస్ సీటు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షేక్ జమీల్ సర్, ఉపాధ్యాయులు నరేష్‌ను అభినందించారు.నరేష్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం ఆయనతో పాటు ఆయన తండ్రి చోలే మహాదేవ్ను శాలువాలతో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నరేష్‌కు అభినందనలు తెలిపిన పాఠశాల సిబ్బంది, భవిష్యత్తులో వైద్య రంగంలో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ షేక్ జమీల్ మాట్లాడుతూ.. తమ పాఠశాల పూర్వ విద్యార్థి ఎంబిబిఎస్ సీటు సాధించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. నరేష్ పట్టుదలతో చదివి వైద్య రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు నరేష్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.