విద్యుత్ కోతలపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, చిప్పలపల్లి మహేందర్ నాథ్.*
అడ్డగూడూర్ అక్టోబర్ 9 మేజర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్
వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధించడాన్ని నిరసిస్తూ అడ్డగూడూర్ పట్టణంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు నేడు రైతులతో, BRS మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులతో వివిధ గ్రామాల సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు గ్రామ శాఖ అధ్యక్ష ,కార్యదర్శులతో నిర్వహించిన ధర్నాలో వారు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన అడ్డగూడూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్. పలువురు మాట్లాడుతూ అడ్డగూడూరు మండలాన్ని కరువు మండలముగా ప్రకటించాలని తహసీల్దార్ శేషగిరిరావుకు వినతి పత్రం అందజేసిన మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం. వ్యక్తం చేశారు తుంగతుర్తి నియోజకవర్గానికి గతంలో కాళేశ్వరం ద్వారా అందించిన నీళ్లు ప్రస్తుతం కనిపించడం లేదని, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వరి పంటలు అన్ని పొట్ట దశలో ఉన్నయని,,. ఈ సమయంలో నిరంతరాయంగా విద్యుత్ అందిస్తే పంటలు గట్టెక్కే అవకాశం ఉంది. కానీ ఈ ప్రభుత్వం కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ విద్యుత్ సరఫరా చేయడం లేదు. దీంతో పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయి అని అన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంట పొలాలు, నెర్రలు వారిన నేలలు, రైతుల కన్నీళ్లే కనిపిస్తున్నాయని అన్నారు.. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదు.అడ్డగూడూరు మండల కేంద్రాన్ని కరువు మండలంగా ప్రకటించాలని తహసీల్దార్ శేషగిరి రావుకు వినతి పత్రాన్ని బిఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే ఉత్పత్తి చేయడం లేదని అన్నారు. సాగునీరు, విద్యుత్ కొరతతో వ్యవసాయ రంగం అస్తవ్యస్తంగా మారిందన్నారు.రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, పంటలు ఎండిపోకుండా వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణశాఖ అధ్యక్షులు నాగులపల్లి దేవగిరి,స్థానిక సర్పంచ్ పూజారి వనజ సైదులు గౌడ్,మాజీ ఎంపిటీసి పూలపెల్లి జనార్దన్ రెడ్డి, పొన్నాల వెంకటేశ్వర్లు,మాజీ యంపిపి దర్శనాల అంజయ్య, వివిధ గ్రామాల సర్పంచ్ లు, పాశం విఘ్ణవర్థన్ రావు, చుక్క బాబు, మందుల రేణుక కిరణ్, కుకునూరి వెంకటరెడ్డి, ఆనందచారి, అంతోని, గజ్జెల్లి రవి, గూడెపు పరమేష్, భాస్కర్ రెడ్డి, వివిధ గ్రామాల ఉప, సర్పంచ్ లు,వివిధ గ్రామాల అధ్యక్ష,కార్యదర్శులు మాజీ సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు,ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు, యువకులు బిఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ అభిమానులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.