BREAKING
11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...! చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్. పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి నేటి నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు

​తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: ఆర్. హనుమంత్ నాయక్

Select Suryaa Now
​తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: ఆర్. హనుమంత్ నాయక్

 

అడవిదేవులపల్లి మేజర్ న్యూస్

​అడవిదేవులపల్లి మండలం 
తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా నాయకులు ఆర్. హనుమంత్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ నెల 10, 11 తేదీలలో హైదరాబాద్‌లోని ఫలక్‌నామా వేదికగా జరగనున్న ఈ మహాసభల్లో పాల్గొనేందుకు అడవిదేవులపల్లి మండల కేంద్రం నుంచి నాయకులు బయలుదేరారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిజనుల హక్కులు, అటవీ భూముల పరిరక్షణ మరియు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కుల సాధన కోసం తెలంగాణ గిరిజన సంఘం నిరంతరం పోరాడుతోందని గుర్తుచేశారు. ఈ రాష్ట్ర మహాసభల్లో గిరిజన సమస్యలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.
​గిరిజన ప్రజా సంఘాల నాయకులు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
​ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం సీనియర్ నాయకులు కొర్ర బాలనాయక్, అలాగే మండల, గ్రామ నాయకులు జబ్బర్, సత్యం, నాగరాజు, రంగా, శివ తదితరులు పాల్గొన్నారు.