BREAKING
దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు డివిస్ కంపెనీల ఉద్యోగాలు సాధించిన ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జగ్గయ్యపేట అభివృద్ధికి రూ.15 కోట్లతో HAM గ్రాంటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఫెలో ల్యాండ్ కి ఆర్డీఎస్ కిట్స్ సిద్దం : వ్యవసాయ శాఖ ఏఓ మజ్జి చెయ్యరులో కనకదుర్గమ్మ ఆలయ వివాదం.. నవరాత్రి పూజలకు అడ్డంకి మనస్థాపంతో వ్యక్తి అదృశ్యం

టిజి మోడల్ స్కూల్, నాగసముద్రాల లో సమాచార హక్కు చట్టానికి తూట్లు

Select Suryaa Now
టిజి మోడల్ స్కూల్, నాగసముద్రాల లో సమాచార హక్కు చట్టానికి తూట్లు

టిజి మోడల్ స్కూల్, నాగసముద్రాల లో సమాచార హక్కు చట్టానికి తూట్లు - టీ, స్నాక్స్ ఇవ్వకుండానే నిధులు డ్రా*

కోహెడ : కోహెడ మండలంలోని నాగసముద్రాల గ్రామ పరిదిలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో సమాచార హక్కు చట్టం (ఆర్ టీ ఐ) ని ఉల్లంఘిస్తున్నారని, పాత రికార్డులు మాయం చేశారని, పేరెంట్స్ మీటింగ్ నిధులు దుర్వినియోగం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆర్ టీ ఐ కి అక్రమ ఫీజు - జీవో ఉల్లంఘన స్కూల్ నిధులు, స్కూల్ అకౌంట్ వివరాలు కోరుతూ _22.08.2026 న ఆర్ టీ ఐ వేశారు. దీనికి  ప్రిన్సిపాల్ _22.09.2026 న 1800 పేజీలకు రూ.5400/- (పేజీకి రూ.3/- చొప్పున) స్కూల్ ప్రైవేట్ అకౌంట్ లో కట్టాలని లేఖ ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వ జీవో ఎం ఎస్ నెంబర్ .454, జిఏడి (ఐ &పీఆర్) డిపాట్, తేది 28.10.2013 మరియు ఆర్ టీ ఐ నిబంధనల ప్రకారం పేజీకి రూ.2/- మాత్రమే వసూలు చేయాలి, ఫీజు ప్రభుత్వ ట్రెజరీ ఖాతా నెంబర్ హెచ్ఈఏడి 0070-60-118-00-103 లోనే కట్టాలి. స్కూల్ ప్రైవేట్ అకౌంట్ లో కట్టమనడం, రూ.3/- వసూలు చేయడం జీవో నేబర్ .454 కు విరుద్ధం.30 రోజులు దాటితే ఉచితం - Sec సెక్షన్ 7(6). 30 రోజులు గడిచినా సమాచారం ఇవ్వకపోవడం తో ఆర్ టీ ఐ చట్టం సెక్షన్ 7(6) ప్రకారం సమాచారం ఉచితంగా ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదు. దీనిపై _26.09.2026 న డిఈఓ సిద్దిపేట కు మొదటి అప్పీల్_ చేశారు - అక్కడి నుండి కూడా సమాధానం లేదు. బిల్లులు మాయం కొత్త ప్రిన్సిపాల్ ఫిర్యాదు
కొత్త ప్రిన్సిపాల్ డిఈఓ కి లేఖ రాశారు. పాత ప్రిన్సిపాల్ బిల్లులు, వోచర్లు, స్టాక్ రిజిస్టర్లు, యూనిఫాం & ఎండిఎం బిల్లులు నాకు అప్పగించలేదు అని.
పేరెంట్స్ మీటింగ్ లో టీ, స్నాక్స్ ఇవ్వకుండానే బిల్లులు? తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పేరెంట్స్ మీటింగ్ లలో టీ, స్నాక్స్ ఇవ్వకుండానే నిధులు డ్రా చేశారని, రికార్డుల్లో మాత్రం ఖర్చు చూపించారని. డిఈఓ విచారణ జరిపి, 2023-2026 అకౌంట్స్ ఆడిట్ చేయించి, జీవో ఎం ఎస్ నేబర్  454 ఉల్లంఘించిన  ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని, లేకపోతే  టీఎస్ఐసి కు రెండవ అప్పీల్ మరియు విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.