BREAKING
దుర్గా మాత ఉత్సవాలు భక్తిభావంతో నిర్వహించాలి రామన్న చెరువులో రొయ్యల గుంటలు తవ్విన వారిపై చర్యలు తీసుకోండి: లోకాయుక్తలో దళిత సంఘర్షణ సమితి ఫిర్యాదు. ముందస్తుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు. పెంచలోరి కళ్యాణోత్సవ వైభవం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష కుమార్ ను తొలగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నెల్లూరు వెళ్లాలంటే నిలబడాల్సిందే..! పాకల బీచ్ లో విషాదం 39వ రాష్ట్రస్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య. బస్ డిపో సమీపంలోని యూటర్న్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు..! నేటి నుంచి నసనకోట దుర్గా భవాని దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రుల మహోత్సవాలు.. భవిత పాఠశాలలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు. కొత్లాపూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి అంగన్‌వాడి కేంద్రాల్లో ప్లాస్టిక్‌ అనర్ధాలపై అవగాహన పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు

Select Suryaa Now
కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు

ఇరగవరం మేజర్ న్యూస్ : మండలం కొత్తపాడు గ్రామానికి చెందిన కుక్కల సూరమ్మ మృతి పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం కొత్తపాడులో నిర్వహించిన ఆమె పెద్దకర్మ కార్యక్రమానికి తణుకు, ఇరగవరం మండలాలకు చెందిన బీజేపీ నాయకులు హాజరై సూరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.సూరమ్మకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆమె నాలుగో కుమారుడు కుక్కల త్రిమూర్తులు ప్రస్తుతం కొత్తపాడు గ్రామ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడో వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోవడం తీరని లోటని, సూరమ్మ మృతి పట్ల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ తణుకు పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు,మాజీ ప్రధాన కార్యదర్శి రాసాబత్తుల అనుకుమార్, ఇరగవరం మండల నాయకులు శీలబోయిన శ్రీనివాస్,అయినవల్లి రామారావు,మండల అధ్యక్షుడు కాట్నం పరిపూర్ణం,గాంధీ, సత్యనారాయణ తదితరులు పాల్గొని సూరమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.

 రిపోర్టర్ దొరబాబు ఇరగవరం పశ్చిమ గోదావరి జిల్లా