కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
కొయ్యలగూడెం,రూరల్ సూర్య న్యూస్ :అక్రమంగా కలపను తరలిస్తున్నారు. అనీ రాబడిన సమాచారం మేరకు కన్నాపురం అటవీ క్షేత్రాలయాధికారి. sk. . ఫిరోజ్ ఆదేశాల మేరకు కలప రవాణా చేస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా కన్నాపురం ఫారెస్ట్ రేంజర్ అధికారి ఎస్ కే. ఫిరోజ్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా రిజర్వాడ్ ఫారెస్ట్ నుంచి కలపను తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అక్రమ దారులను హెచ్చరించారు . శుక్రవారం నైట్ కొయ్యలగూడెం మండలం గవరవరం పరిసర ప్రాంతాలలో విధులను నిర్వర్తిస్తుండగా ఏపీ. 37. టిఎఫ్.( 0461 ) బొలెరో వాహనంలో ( టేకు )కలపను తరలిస్తుండగా నవీన్ , కొవ్వాడ ఎఫ్బి ఓ , వెంకన్న బాబు , దినేష్ , అధికారులు వాహనాన్ని తనిఖీ నిర్వహించే కలప , వాహనాన్ని కార్యాలయానికి తరలించారు అని రేంజర్ ఫిరోజ్ మీడియాకు తెలిపారు .
రిపోర్టర్ కిషోర్ కొయ్యలగూడెం ఏలూరు జిల్లా