అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ* *అందమైనబతుకమ్మలతోపోటీపడినమహిళలు*
మిర్యాలగూడ, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను శనివారం మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలుఆనందోత్సాహాలతోజరుపుకున్నారు.మిర్యాలగూడ పట్టణంతో పాటు వేములపల్లి, మాడ్గులపల్లి మండలాలలోని ప్రతిగ్రామం లో ఆడపడుచులు ప్రకృతి లో లభించిన రకరకాల పూలను సేకరించి అందంగా పేర్చిఎంగిలిపూలబతుకమ్మ గా ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలాలలో బతుకమ్మలను పేర్చిచుట్టూ తిరుగుతూ ఆడిపాడారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రతిఇంటాసుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లుమహిళలు తెలిపారు.పండుగ నేపథ్యం లో మిర్యాలగూడ పట్టణం లోని ప్రధాన కూడళ్లు, దేవాలయాలవద్దబతుకమ్మల కోలాహలం నెలకొంది. చిన్నారుల నుండి పెద్దల వరకు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనిసంబరాలనుమరింత వైభవంగా మార్చారు.