రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
వల్లూరు సమీపంలోనిరైజ్ కృష్ణసాయి ప్రకాశం గ్రూప్ కళాశాలలో నేడు అంగరంగ వైభోగముగా ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల కరెస్పాండంట్ శ్రీ శిద్దా హనుమంత రావు గారు తెలియజేసారు.
ఈ కార్యక్రమము లో కళాశాల సెక్రెటరీ శ్రీ శిద్దా హనుమంత రావు గారు, డైరెక్టర్ డాక్టర్ AV భాస్కర రావు గారు, ప్రిన్సిపాల్ డాక్టర్ KV సుబ్రహ్మణ్యం గారు, గౌరవ చైర్మన్ శ్రీ ఇస్కాల చినరంగమన్నారు గారు, వివిధ విభాగాధిపతుల, అధ్యాపకులు పాల్గొన్నారు .
ఈ కార్యక్రమములో బి.టెక్ ప్రధమ సంవత్సరము, ద్వితీయ సంవత్సరము విద్యార్థులు పాల్గొని ప్రారంభ కార్యక్రమములో విద్యార్థులు పలురకాల నృత్యాలతో అందరిని అలరించారు.
ఈ కార్యక్రమాన్ని కరెస్పాండంట్ శ్రీ శిద్దా హనుమంతరావుగారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరము విద్యార్థినులకు ఫ్యాషన్ షో నిర్వహించి వారిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ విభాగాలుగా నిర్ణయించి బహుమతులను అందచేశారు.
, అనంతరం 2025-26 సంవత్సరానికి యూనివర్సిటీ పరీక్షలలో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు కళాశాల డైరెక్టర్ డాక్టర్ AV. భాస్కరరావు గారు మరియు విభాగాధి పతుల చేతులమీదుగా ప్రశంసా పత్రాలను మరియు మెడల్ ను ప్రదానము చేసారు.
కళాశాల గౌరవ చైర్మన్ శ్రీ ఇస్కాల చినరంగమన్నారు గారు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని తమ తోటి విద్యార్థులను ఎలా గౌరవించాలి, సీనియర్ విధ్యార్ధులనుండి వారి అనుభవాలను తెలుసుకొని భవిష్యత్తును అందముగా తీర్చిదిద్దుకోవాలని తెలియ చేస్తూ , గత విద్యా సంవత్సరములో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు.