BREAKING
బతుకమ్మ వేళా.. లక్ష్మాపూర్‌ రింగ్‌ రోడ్డులో చీకట్లే.. అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆగ్రహం పోలాండ్‌లో వరుస కత్తిపోటు దాడులు రియాద్ విమానాశ్రయం వద్ద భారీ శబ్దంతో పేలుడు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ను తొలగించాలని ఢిల్లీకి తరలిన యూత్ కాంగ్రెస్ అవనిగడ్డలో ఉషశ్రీ పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం- ఎమ్మెల్యే మండలి శ్రీకాళహస్తి పాలకమండలి సభ్యులకు తటవర్తి రమేష్ ఆత్మీయ ఆతిథ్యం ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు మాని.. అందుగుల గ్రామాభివృద్ధిపై దృష్టి సారించండి తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.. రవి పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు స్పెయిన్ రాజకీయాల్లో సెంట్రిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రముఖ లాయర్ మిరియం పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో ఫ్రెషర్స్ సందడి. ముప్పవరంలో 'దేవీ శరన్నవరాత్రి' ఉత్సవ శోభ: విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ శిరిడీ సాయిబాబా దేవస్థానం. పుతిన్, ట్రంప్ ఫోన్ కాల్...ముందుగా ఫోన్ పెట్టేందుకు ఇద్దరూ ఇష్టపడలేదన్న క్రెమ్లిన్ రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ఎమ్మెల్యే రోషన్ కుమార్ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన మామిండ్ల ముత్యాలు యాదవ్ మండపం ఆకలితో ఎవరూ ఉండకూడదనే సంకల్పంతో అన్నదానం.. తాళ్లపల్లి రమేష్ గుప్తా సేవలకు ప్రశంసలు

పాకల బీచ్ లో విషాదం

Select Suryaa Now
పాకల బీచ్ లో విషాదం

*. సముద్ర స్నానానికి వచ్చి ఇద్దరు మృతి 
*. అలల ఉధృతికి ఇంకో ఇద్దరు గల్లంతు 
*. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు 
*. ఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ


సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

        సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన వారిలో ఇద్దరు యువకులు అలల ఉధృతికి మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురుని స్థానిక మత్స్యకారులు, పోలీసులు కాపాడారు. జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు ఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రమాద తీరు, మృతుల వివరాలను వివరించారు. 
           కనిగిరి మండలం శ్రీరంగపురం గ్రామం నుండి సుమారు 70 మంది తమ ఆచారం ప్రకారం పోలేరమ్మ జాతర జరుపుకొని, సముద్ర స్నానం చేయడానికి పాకల బీచ్‌కు వచ్చారు. అక్కడ స్నానం చేస్తుండగా ఒక పెద్ద అల వచ్చి కొందరిని లోపలికి లాక్కెళ్ళిందని ఆ బృంద సభ్యులు చెప్పినట్లు 
తెలిపారు. పరిస్థితిని గమనించిన స్థానిక మత్స్యకారులు, పోలీసు టవర్ వద్ద ఉన్న పోలీసులు వెంటనే స్పందించి బోట్ల ద్వారా కొంతమందిని రక్షించారన్నారు.

*మృతులు, క్షతగాత్రుల వివరాలు:*

• మృతులు :  పాలడుగు తేజ (20 ఏళ్లు), బత్తుల మహేష్ బాబు (22 ఏళ్లు ). 
• గల్లంతయిన వారు :  దేవల విష్ణు మరియు దేవల నారాయణ.
• చికిత్స పొందుతున్నవారు: మనోజ్ కుమార్, మహేష్ తేజ, నరసింహ. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

             ప్రస్తుతం జి.జి.హెచ్ (ఒంగోలు), కందుకూరు కోటారెడ్డి ఆసుపత్రి మరియు ఒంగోలు రమేష్ ఆసుపత్రులలో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందుతోందన్నారు. పోలీసు యంత్రాంగం మరియు మత్స్యకారులు గల్లయిన వారి ఆచూకీ కోసం డ్రోన్లు మరియు పడవల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన చెప్పారు. బాధిత కుటుంబాలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. బీచ్ కు వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని, భద్రతాపరంగా పోలీసు సిబ్బంది చేసే సూచనలను పాటించాలని కలెక్టర్ కోరారు. 
        అనంతరం కందుకూరు కోటారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసింహను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, ఎలాంటి ప్రమాదము లేదని వైద్యులు తెలిపారు. ఈ సమయంలో కలెక్టర్ వెంట కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ. డి.హిమవంశి, కందుకూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారు.