BREAKING
రియాద్ విమానాశ్రయం వద్ద భారీ శబ్దంతో పేలుడు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ను తొలగించాలని ఢిల్లీకి తరలిన యూత్ కాంగ్రెస్ అవనిగడ్డలో ఉషశ్రీ పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం- ఎమ్మెల్యే మండలి శ్రీకాళహస్తి పాలకమండలి సభ్యులకు తటవర్తి రమేష్ ఆత్మీయ ఆతిథ్యం ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు మాని.. అందుగుల గ్రామాభివృద్ధిపై దృష్టి సారించండి తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.. రవి పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు స్పెయిన్ రాజకీయాల్లో సెంట్రిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రముఖ లాయర్ మిరియం పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో ఫ్రెషర్స్ సందడి. ముప్పవరంలో 'దేవీ శరన్నవరాత్రి' ఉత్సవ శోభ: విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ శిరిడీ సాయిబాబా దేవస్థానం. పుతిన్, ట్రంప్ ఫోన్ కాల్...ముందుగా ఫోన్ పెట్టేందుకు ఇద్దరూ ఇష్టపడలేదన్న క్రెమ్లిన్ రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ఎమ్మెల్యే రోషన్ కుమార్ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన మామిండ్ల ముత్యాలు యాదవ్ మండపం ఆకలితో ఎవరూ ఉండకూడదనే సంకల్పంతో అన్నదానం.. తాళ్లపల్లి రమేష్ గుప్తా సేవలకు ప్రశంసలు గండిగూడెంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు మధిరలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం

నెల్లూరు వెళ్లాలంటే నిలబడాల్సిందే..!

Select Suryaa Now
నెల్లూరు వెళ్లాలంటే నిలబడాల్సిందే..!

మర్రిపాడు మేజర్ న్యూస్ :   జిల్లా సరిహద్దు ప్రాంతమైన మర్రిపాడు మండలంలోని ప్రజలు నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై వెళ్లేటటువంటి ఆర్టీసీ బస్సుల్లో  ప్రయాణించాలంటే హడలెత్తిపోతున్నారు. అటు కడపకు ఇటు నెల్లూరుకు సెంటర్ పాయింట్ మర్రిపాడు మండల కేంద్రం. ఈ తరుణంలో కడప నుంచి గాని నెల్లూరు నుంచి గాని వచ్చే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి మర్రిపాడు మండలాన్ని తాకుతున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మర్రిపాడు మండల ప్రజలు నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరుకు వెళ్లే బస్సుల్లో కడప, బద్వేల్ ప్రాంతాలకు వచ్చేసరికి సీట్లు నిండిపోతున్నాయి. దీంతో మర్రిపాడు మండల ప్రజలు నెల్లూరుకు వెళ్లాలంటే 80 కిలోమీటర్ల పైనే నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటుగా వృద్ధులు పరిస్థితి అయితే మరి దయనీయం. గతంలో ఈ పరిస్థితి లేకపోయినప్పటికీ మహిళలకు శ్రీ శక్తి పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి తిప్పలు తప్పడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. కనీసం నెల్లూరు - ముంబై జాతీయ రహదారిపై ప్రయాణించే కడప, బద్వేల్, పొద్దుటూరు, అనంతపురం, కర్నూల్, బస్సు సర్వీసులతోపాటుగా మరో అదనపు బస్సులు ఏర్పాటు చేస్తే గాని సమస్య పరిష్కారం కాదని మండల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాతీయ రహదారిపై ప్రయాణించే బస్సులు ప్రారంభ దశలో ఉండే స్టేజీల వద్దనే నిండిపోతుండడంతో ప్రధాన కూడలిలో కూడా ఆగకపోతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు కడపకు గాని ఇటు నెల్లూరుకు గాని 80 కిలోమీటర్ల పైనే ఉండడంతో నిలుచొని ప్రయాణించాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోని ఆర్టీసీ బస్సుల సర్వీసులను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.