BREAKING
యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఒడిశాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం: కంధమాల్, బౌద్ జిల్లాల్లో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)! ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానని బురిడీ :

నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు - ఢిల్లీ అరెస్టులను ఖండించండి

Select Suryaa Now
నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు - ఢిల్లీ అరెస్టులను ఖండించండి

పలాస, సూర్య : విద్యార్థి, యువజనులపై ఢిల్లీ పోలీసుల అక్రమ అరెస్టులను ఖండించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పిలుపునిచ్చింది.పలాస మండలం కోసంగిపురం జంక్షన్ లోని సీపీఐ(ఎంఎల్) కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రాష్ట్ర నాయకులు తామాడ సన్యాసిరావు, మద్దిల రామారావు మాట్లాడారు.జంతర్ మంతర్ ధర్నాను విజయవంతం చేసిన యువతకు ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక ఆటంకాలు సృష్టించి 17 రైళ్లు, మెట్రో సేవలు రద్దు చేసి ఢిల్లీ చేరుకోకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. నిరసన తెలపడం రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, దాన్ని కాలరాయడం దుర్మార్గమని అన్నారు.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఫారం-6 రద్దు, సర్ ప్రక్రియల ద్వారా 13 కోట్ల ఓటర్ల తొలగింపును వెంటనే నిలిపివేసి తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా నాయకులు కుత్తుం లోకనాథం, ఏఐసీసీటీయూ జిల్లా నాయకులు కుత్తుం దుష్యంత్ రావు, పిన్నింటి నాగేశ్వరరావు, రైతు నాయకులు పొత్నంపల్లి అప్పారావు, ఆర్వైఏ జిల్లా నాయకులు మద్దిల కైలాస్, మద్దిల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : విశ్వేశ్వర, పలాస, శ్రీకాకుళం జిల్లా.