BREAKING
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: ఈ నెల 14 లేదా 15న నోటిఫికేషన్ విడుదల! బంగ్లాదేశ్‌లో వైభవంగా మహాలయ వేడుకలు దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు! జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్

Select Suryaa Now
పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్ గారు తెలిపారు. పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ‘పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు, పోలీస్ సిబ్బంది పాల్గొని తమ వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలకు సంబంధించిన వినతులను ఎస్పీ గారికి స్వయంగా సమర్పించారు.

ఎస్పీ గారు సిబ్బంది నుంచి అందిన వినతులను పరిశీలించి, వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తూ, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి నెల రెండవ శనివారం ‘పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సిబ్బంది తమ వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అదేవిధంగా, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ‘ఎస్పీ సంపర్క్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ సిబ్బంది నేరుగా ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. సిబ్బంది ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ గారు సూచించారు.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్‌ఐ షేక్ మౌలుద్దీన్, సీసీ హరికృష్ణ, డీపీఓ సిబ్బంది, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.