బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి టీడీపీ అండ : ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో బీసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశం
మార్టూరు:
బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీసీ నేతలు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. శనివారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బీసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంసీ చైర్మన్ గుంజి వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కల రాఘవతో పాటు పలువురు బీసీ నాయకులు మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించి, వారి అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
టీడీపీ హయాంలోనే బీసీలకు రాజకీయ ప్రాధాన్యం
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పిస్తూ వస్తోందని నాయకులు పేర్కొన్నారు. దివంగత ఎన్టీ రామారావు బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఇచ్చారని, అనంతరం చంద్రబాబు నాయుడు బీసీలకు రిజర్వేషన్లను 34 శాతానికి పెంచేందుకు కృషి చేశారని వివరించారు. బీసీలు రాజకీయంగా ఎదగడానికి, స్థానిక సంస్థల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి టీడీపీ ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని విమర్శించారు. బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడంతో పాటు బలహీనవర్గాలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యానికి విఘాతం కలిగించారని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేసే ప్రయత్నాలను కోర్టుల ద్వారా అడ్డుకోవడం సరికాదన్నారు. బీసీల అభ్యున్నతిపై మాట్లాడే ముందు వైసీపీ తన గత పాలనను సమీక్షించుకోవాలని హితవు పలికారు.
బీసీలకు ఏలూరి పెద్దపీట:శంసుద్దీన్
పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తున్నారని బీసీ నాయకుడు షేక్ శంసుద్దీన్ పేర్కొన్నారు. మండల పార్టీ అధ్యక్ష పదవులతో పాటు రాష్ట్రస్థాయి డైరెక్టర్ పదవుల్లోనూ బీసీలకు అవకాశాలు కల్పించి నాయకత్వ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. బీసీలు అన్ని రంగాల్లో ఎదగాలన్న చిత్తశుద్ధితో ఏలూరి పనిచేస్తున్నారని కొనియాడారు.
తెలుగుదేశం పార్టీ బీసీలకు గుండె:
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కోడూరి శేషబ్రహ్మచారి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ బీసీలకు గుండె వంటిదని అభివర్ణించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆటంకాలు కల్పించే ప్రయత్నాలను బీసీ సమాజం గమనించాలని అన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉండి తమ రాజకీయ హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మార్టూరు మండల టీడీపీ అధ్యక్షుడు శివరాత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ,
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించడంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందుంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఐక్యంగా పనిచేసి విజయాలు సాధించాలని కోరారు.
కారంచేడు మండల టీడీపీ అధ్యక్షుడు షేక్ ఖాసిం మాట్లాడుతూ, ‘
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించాలన్న ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉండటం సంతోషకరమన్నారు.
ఐక్యతతో విజయాలు సాధించాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం లభించేలా నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. బీసీ వర్గాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగి, ఎన్నికల్లో 100 శాతం విజయ లక్ష్యంతో పనిచేయాలని నేతలు ఆకాంక్షించారు. రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధిలోనూ బీసీలు ముందుండేలా కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వడ్లమూడి సాంబయ్య, ఉప్పుటూరు నరేంద్ర,వాటిపల్లి ఏడుకొండలు, కొక్కిలిగడ్డ రాములు, దండుప్రోలు బాలరాజు, విష్ణు, దండ్రుపోలు తిరుపతిరావు , జంజనం సాయి, షేక్ అక్రమ్, నాలి నాగరాజు, పాలేటి కోటేశ్వరరావు, మువ్వ ఆంజనేయులు, కొమ్మలపాటి లక్ష్మయ్య , జంజనం సుబ్బారావు,వాసు, పాల్గొన్నారు