రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి చీకటి రోజులు -- బీయస్ పి అధ్యక్షులు జయ బాబు
నరసాపురం, మేజర్ న్యూస్:ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేకపోయిందని,నరసాపురం లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం స్థానికంగా సమస్యల మీద దృష్టి సారించట్లేదని నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జి గూటం జయ బాబు అన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.నరసాపురం పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్య ఉంది ప్రభుత్వం ఈ సమస్యని ఇప్పటివరకు పరిష్కారం చేయలేదని,పైగా కూటమి నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కమాట చెప్పి పట్టణ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారన్నారు.నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానండినప్పటికీ కళ్ళు లేని కబోదిలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ గాని కనీసం పట్టించుకోపోవటం దురదృష్టకరమన్నారు.స్థానిక సంస్థలకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల విడుదలవుతున్న వేళ కల్లబొల్లి మాటలతో ఓట్లు కోసం మీ ముందుకు వస్తున్నారుఈ కూటమినాయకులు ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నిత్యావసర వస్తువులు ధరల గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలని జయ బాబు పిలుపునిచ్చారు. బియ్యం కిలో ధర 55 నుండి 80 రూపాయలకు పెంచడం దారుణం అయినప్పటికీ, నిస్సిగ్గు గా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి?, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేనందుకా? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నందుకా? పెట్రోల్ ధరలు, కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచినందుకా? ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని స్థానిక సంస్థలు ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయనకోరారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా,