BREAKING
మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Select Suryaa Now
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్  :   ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్స్ వంటి పారామెడికల్ సిబ్బంది చేస్తున్న సమ్మెకు సిఐటియు రూరల్ కమిటీ మద్దతు తెలియజేసి వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు,సిఐటియు  రూరల్ కార్యదర్శి కే. పెంచల నరసయ్య,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆర్ఎం సునీల్ కుమార్ మద్దతు తెలియజేసి అనంతరం మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లోని అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానం లో పారామెడికల్ సిబ్బందిగా పనిచేస్తున్న ఉద్యోగులు గత నెల రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విధులు నిర్వహిస్తూనే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. గత రెండేళ్లుగా తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నప్పటికీ, ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోంది.అలాగే ఉద్యోగులను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, కనీసం యూనియన్ నాయకులతో చర్చలు జరపకుండా, సమస్యను మరింత జటిలం చేసింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో శనివారం నాడు  పారామెడికల్ సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మెలోకి దిగారు.

సమ్మె చేస్తున్న ఉద్యోగులను బెదిరించడం ఎంతవరకు సమంజసం?

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, సమ్మెలో పాల్గొంటున్న యూనియన్ నాయకులకు, చురుగ్గా పాల్గొంటున్న ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, విధుల నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని కోరడం ఎంతవరకు సమంజసమని సీఐటీయూ ప్రశ్నిస్తోంది.అలాగే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా, నోటీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడటం సరైన పద్ధతి కాదు. రాష్ట్రంలో అనేక ఉద్యోగ సంఘాలు హక్కుల కోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. అదే విధంగా నేడు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది తమ హక్కుల కోసం పోరాడుతున్నారు.ప్రభుత్వానికి చేతనైతే వారి సమస్యలను పరిష్కరించాలి. అంతేకానీ, నోటీసులు జారీ చేసి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే సీఐటీయూ చూస్తూ ఊరుకోదు. పారామెడికల్ సిబ్బందికి సీఐటీయూ అండగా నిలుస్తుంది.

పారామెడికల్ సిబ్బంది డిమాండ్లు న్యాయమైనవే 

పారామెడికల్ సిబ్బంది ఏవో గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు తగిన వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన పనులు చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలనే అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా ప్రభుత్వం గౌరవించి, అమలు చేయాల్సిన అవసరం ఉంది.కోర్టు తీర్పులు, ఉద్యోగుల హక్కుల విషయంలో తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నప్పటికీ, ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసే విషయంలో మాత్రం వెంటనే స్పందించడం దురదృష్టకరం.

ఉద్యోగుల పోరాటానికి సీఐటీయూ సంపూర్ణ మద్దతు

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పారామెడికల్ సిబ్బంది యూనియన్ నాయకులతో చర్చలు జరపాలి. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. ఉద్యోగులను బెదిరించే చర్యలను తక్షణమే నిలిపివేయాలి.ప్రభుత్వం స్పందించకపోతే నేటి నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో  పారామెడికల్ సిబ్బంది పోరాటానికి మద్దతుగా ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంటాయి. ఇతర ప్రజాసంఘాలను కూడా కలుపుకొని ఉద్యోగుల హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ అధ్యక్షులు ఎం సుధాకర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వజ్రమ్మ, మాల కొండయ్య, షబ్బీర్, శంషాద్ బేగం, గయాజ్ తదితరులు పాల్గొన్నారు.