BREAKING
ముందస్తుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు. పెంచలోరి కళ్యాణోత్సవ వైభవం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష కుమార్ ను తొలగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నెల్లూరు వెళ్లాలంటే నిలబడాల్సిందే..! పాకల బీచ్ లో విషాదం 39వ రాష్ట్రస్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య. బస్ డిపో సమీపంలోని యూటర్న్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు..! నేటి నుంచి నసనకోట దుర్గా భవాని దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రుల మహోత్సవాలు.. భవిత పాఠశాలలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు. కొత్లాపూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి అంగన్‌వాడి కేంద్రాల్లో ప్లాస్టిక్‌ అనర్ధాలపై అవగాహన పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి ​స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శ్రీకారం... రూ.9.50 కోట్లతో పనులకు ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే పల్లా శంకుస్థాపన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి చీకటి రోజులు -- బీయస్ పి అధ్యక్షులు జయ బాబు

చెయ్యరులో కనకదుర్గమ్మ ఆలయ వివాదం.. నవరాత్రి పూజలకు అడ్డంకి

Select Suryaa Now
చెయ్యరులో కనకదుర్గమ్మ ఆలయ వివాదం.. నవరాత్రి పూజలకు అడ్డంకి

సూర్య న్యూస్ డెస్క్ :

కాట్రేనికోన మండలం చెయ్యరు గ్రామంలో కనకదుర్గమ్మ ఆలయ స్థల వివాదం ముదిరింది. దసరా నవరాత్రుల వేళ పూజలకు అనుమతి లేకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

60 ఏళ్లుగా పూజలు

గ్రామ కంఠం భూమిలో సుమారు 60 ఏళ్లుగా చిన్న కనకదుర్గమ్మ విగ్రహం షెడ్డు ఉంది. గ్రామస్తులు ఇక్కడ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ, ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తున్నారు. షెడ్డు శిథిలం కావడంతో కొత్త నిర్మాణం చేయాలని భక్తులు నిర్ణయించారు.

వివాదానికి కారణం

ఆలయం వెనుక ఉన్న భూమి యజమానిని గుడి అభివృద్ధికి కొంత స్థలం అడగగా, ఆయన నిరాకరించారు. కట్టుకుంటే అభ్యంతరం లేదు కానీ తన స్థలం ఇవ్వనని చెప్పారు. భక్తులు పాత నిర్మాణాన్ని తొలగించి అదే చోట కొత్త నిర్మాణం చేపడుతుండగా, ఆ యజమాని పెద్ద రాళ్లు వేసి అడ్డుకున్నారు. ఆ స్థలం తనదేనని, ఎలాంటి నిర్మాణం జరగరాదని పట్టుబట్టారు.

పోలీసుల జోక్యం.. కోర్టుకు చేరిన వివాదం

పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదు. గుడి నిర్మాణం అక్రమమంటూ ఆ భూ యజమాని కోర్టును ఆశ్రయించారు. తహసీల్దార్‌తో సర్వే చేయించగా, ఆ స్థలం భూ యజమానికి సంబంధించినది కాదని, గ్రామ కంఠమని కొలతల్లో తేలింది. ఈ విషయంలో కోర్టు కూడా మందలించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కూడా వచ్చి పరిశీలించారు.

నవరాత్రి పూజలపై ఆంక్షలు

చెయ్యరు గున్నెపల్లికి చెందిన ఒక తెలుగుదేశం నాయకుడు ఆ భూ యజమానికి మద్దతుగా నిలుస్తూ హిందువులను ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పందిరి రాటముహూర్తం, నవరాత్రి ఉత్సవాలు, తొమ్మిది రోజుల పూజలు చేయరాదంటూ పోలీసులను కాపలా పెట్టారు.

తొమ్మిది రోజులైనా పూజలు చేసుకోనివ్వాలని భక్తులు కోరుతున్నా, తహసీల్దార్ ఉత్తర్వులు ఉన్నాయంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంగీకరించడం లేదు. అక్కడికి వచ్చే భక్తులపై కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

"భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్‌లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. దసరా నవరాత్రుల్లో కనీసం తొమ్మిది రోజులైనా పూజలు చేసుకునే అవకాశం ఇవ్వరా?" అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.