ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం
పటాన్‌చెరు, సూర్య ప్రతినిధి;సామాజిక సేవలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
పటాన్‌చెరు క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బండ్లగూడలోని మార్క్స్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఇలాంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని, అనారోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స పొందాలని సూచించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సామాజిక బాధ్యతతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, చంద్రశేఖర్, అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.