BREAKING
సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు హెచ్చరిక. కేంద్ర మంత్రి కృషితో అత్తిలిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రం -- ఎన్‌ఎండీసీ నుంచి రూ.75 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో 7 అత్యాధునిక డయాలసిస్ మిషన్లు శ్రీమహమ్మారమ్మ ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు కొమరగిరిపట్నం శివారు దైవాలపాలెంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు! బీసీలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయింపు నిర్ణయం పట్ల జగదీశ్వరి హర్షం సీతారాంపల్లి గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలి వి.హెచ్.పి సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి పుష్కరాల పనులకు శంకుస్థాపనలు * రూ.4.02కోట్లతో రహదారుల అభివృద్ది :వాసంశెట్టి సత్యం మృతుల కుటుంబాలకు కంచి పరమేశ్వర రెడ్డి ఆర్ధిక సాయం వృద్ధురాలు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి షాద్ నగర్ లో రోడ్డు ప్రమాదం... వ్యక్తి దుర్మరణం అవయవదానానికి సమ్మతించిన టీడీపీ నేత మాధవరావు 1982 నుంచి తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో ఘన గౌరవం శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం బిజెపిలో బలమైన బీసీ నేత జబ్బల శ్రీనివాసులు

సింగారంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
సింగారంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

మునుగోడు,మేజర్ న్యూస్:;తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు, ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ తమ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పారు.
గ్రామ మహిళలంతా ఒకచోట చేరి ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ వేడుకలను జరుపుకోవడంతో సింగారం గ్రామంలో పండుగ శోభ సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ప్రతి ఏటా బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకుంటామని మహిళలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలలు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.