BREAKING
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: ఈ నెల 14 లేదా 15న నోటిఫికేషన్ విడుదల! బంగ్లాదేశ్‌లో వైభవంగా మహాలయ వేడుకలు దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు! జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

జుంటుపల్లి ప్రాజెక్టు కాలువల అభివృద్ధికి రూ.5.71 లక్షలు..!

Select Suryaa Now
జుంటుపల్లి ప్రాజెక్టు కాలువల అభివృద్ధికి రూ.5.71 లక్షలు..!

దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోని తూములకు మహర్దశ
సోమవారం పనులకు శ్రీకారం.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
యాలాల, మేజర్ న్యూస్ (అక్టోబర్ 10)మండలం జుంటుపల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల అభివృద్ధి పనులకు రూ.5.71 లక్షల నిధులు కేటాయించారు.దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోని ప్రాజెక్టు తూముల అభివృద్ధికి త్వరలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవతో అడుగులు పడుతున్నాయి.అక్టోబర్ 12సోమవారం ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రీకారం చుట్టనున్నారు.కాలువలు,తూముల మరమ్మతులతో సాగునీటి సరఫరా మెరుగుపడి వివిధ గ్రామల ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరనుంది.పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.నిధుల కేటాయింపుపై జుంటుపల్లి సర్పంచ్ వాణిశ్రీ రమేష్ గౌడ్‌తో పాటు స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రిపోర్టర్: ప్రకాష్ గౌడ్, యాలాల, వికారాబాద్ జిల్లా.