వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు
నెల్లిమర్ల, సూర్య : కాలజ్ఞాని, మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దివ్య చరిత్రను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ జన ప్రసాద్ పిలుపునిచ్చారు.
స్థానిక వీరబ్రహ్మంగారి ఆలయంలో శనివారం ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు వీర్ని చిదంబరం అధ్యక్షతన ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన ప్రసాద్ మాట్లాడుతూ... సంఘం బలోపేతానికి, విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి అందరూ ఐక్యంగా నడుం బిగించాలని కోరారు. నెల్లిమర్ల ఆలయాభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తామని, పేద విశ్వబ్రాహ్మణులను ఆదుకోవడానికి సమాజం ముందుండాలని సూచించారు.
ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు వీర్ని చిదంబరం, గౌరవాధ్యక్షుడు వీర్ని సూరిబాబు, ప్రధాన కార్యదర్శి కాకినాడ గుప్తేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వేముల తాతాచారి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రాజారావు, నెల్లిమార్ల, విజయనగరం జిల్లా.