ఫెలో ల్యాండ్ కి ఆర్డీఎస్ కిట్స్ సిద్దం : వ్యవసాయ శాఖ ఏఓ మజ్జి
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మండలం లో ఫెలో ల్యాండ్ కి ఆర్డీఎస్ కిట్స్ రెడీ చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ ఏఓ మజ్జి శ్యాం సుందర్ రావు తెలిపారు.
బొబ్బిలి మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ రావు మరియు డిపిఎం విజయ్ కుమార ఆదేశానుసారం సూపర్ ఎలినో వలన ఉబాలు అవ్వని పొలాలలో ఇప్పుడు మినువులు, పెసలు, ఉలవలు వేసుకునే పొలాలలో ఏకపంట కాకుండా బహుళ పంటల గురించి సజ్జ, జొన్న, అణువులు, బీర, చిక్కుడు, తోటకూర, గోంగూర, కందులు, అంతర పంటలుగా వేసుకోవడం గురించి బొబ్బిలి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ కలిపి మెట్టవలస రైతు భరోసా కేంద్రంలో లో కిట్స్ తయారు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.