విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి
విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వాములు కావాలి
కనిగిరి ,మేజర్ న్యూస్ :వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో భాగంగా స్వర్ణాంధ్ర–2047 సాధన కోసం నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా శనివారం కనిగిరి పట్టణంలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు నరాల శ్రీనివాసరెడ్డి, కనిగిరి పట్టణ బీజేపీ అధ్యక్షులు నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వాములై గ్రామాల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థినులతో నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు,పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.