BREAKING
దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు డివిస్ కంపెనీల ఉద్యోగాలు సాధించిన ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జగ్గయ్యపేట అభివృద్ధికి రూ.15 కోట్లతో HAM గ్రాంటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఫెలో ల్యాండ్ కి ఆర్డీఎస్ కిట్స్ సిద్దం : వ్యవసాయ శాఖ ఏఓ మజ్జి చెయ్యరులో కనకదుర్గమ్మ ఆలయ వివాదం.. నవరాత్రి పూజలకు అడ్డంకి మనస్థాపంతో వ్యక్తి అదృశ్యం

పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం

Select Suryaa Now
పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం

ఆమదాలవలస, సూర్య : ​ఆమదాలవలస పట్టణ శివారులోని లెప్రసీ కాలనీలో శనివారం కృత్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సరుబుజ్జి గ్రామానికి చెందిన అధ్యాపకులు కూన హర్షవర్ధన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని సుమారు 40 మంది అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు అన్నప్రసాదంతో పాటు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృత్విక్ ఫౌండేషన్ చైర్మన్ చిగురుపల్లి చిన్ను మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ పుట్టినరోజులు, వివాహాల వంటి శుభకార్యాల సమయంలో అనవసర ఆర్భాటాలకు, ప్రచారాలకు పోకుండా తమకు తోచినంతలో పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావాలి అని కోరారు. అనంతరం దాత కూన హర్షవర్ధన్ కు చిగురుపల్లి చిన్ను కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో రామచంద్రరావు, బొడ్డేపల్లి చంద్రశేఖర్, ఆనంద్, రాజకుమార్, అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : రాము, సరుబుజ్జి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.