రామ మందిర నిర్మాణానికి డిసిసి కార్యదర్శి విరాళం
సూర్య- బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి బిక్కనూర్ పట్టణానికి చెందిన డిసిసి కార్యదర్శి, న్యాయవాది లింగాల రాజబాబు గౌడ్ 25 వేల 116 రూపాయల విరాళాన్ని శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి ధనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందించిన రాజబాబు గౌడ్ ని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మల్లారెడ్డి, ఏలేటి యాదిరెడ్డి తదితరులు ఉన్నారు