ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
సూర్య నేరడిగొండ: మండలంలోని బుగ్గారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజన రైతు బిడ్డ రాథోడ్ బలరాం కుమార్తె రాథోడ్ వర్ష ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించినది. శనివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాథోడ్ బలరాం,విష్ణువర్షను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయం చేస్తూ కూతురును ఉన్నత చదువులు చదివిస్తున్న రాథోడ్ బలరామును ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువులో కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్ విష్ణువర్శకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, యువ నాయకులు రాథోడ్ సురేందర్ పాండు నకులుడు తదితరులు ఉన్నారు