BREAKING
కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు డివిస్ కంపెనీల ఉద్యోగాలు సాధించిన ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జగ్గయ్యపేట అభివృద్ధికి రూ.15 కోట్లతో HAM గ్రాంటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఫెలో ల్యాండ్ కి ఆర్డీఎస్ కిట్స్ సిద్దం : వ్యవసాయ శాఖ ఏఓ మజ్జి చెయ్యరులో కనకదుర్గమ్మ ఆలయ వివాదం.. నవరాత్రి పూజలకు అడ్డంకి మనస్థాపంతో వ్యక్తి అదృశ్యం అణచివేతతో మమ్మల్ని ఆపలేరు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేస్తాం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యం ఎలికట్ట ఆలయం...

108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం..

Select Suryaa Now
108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం..

గార, సూర్య : పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి 108 అంబులెన్స్‌లోనే సిబ్బంది సురక్షితంగా ప్రసవం చేశారు. గార మండలం కళింగపట్నం పల్లిపేట గ్రామానికి చెందిన ఎన్‌. భాను బెహరా పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. దీంతో వెంటనే గ్రామానికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించేందుకు బయలుదేరారు.

అయితే మార్గమధ్యంలో గర్భిణికి నొప్పులు తీవ్రం కావడంతో పరిస్థితిని గుర్తించిన ఈఎంటీ హరీష్‌, పైలట్‌ నారాయణరావు అంబులెన్స్‌ను రహదారి పక్కన నిలిపి, స్థానిక ఆశా కార్యకర్త లక్ష్మి సహకారంతో వాహనంలోనే ప్రసవం నిర్వహించారు. ఈ క్రమంలో భాను బెహరా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

అనంతరం తల్లీబిడ్డలకు ప్రాథమిక వైద్య సంరక్షణ అందించి, క్షేమంగా రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులకు అప్పగించారు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షిత ప్రసవానికి సహకరించిన 108 సిబ్బంది హరీష్‌, నారాయణరావు, ఆశా కార్యకర్త లక్ష్మిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.

 

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.