స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేస్తాం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అన్ని స్థానాలు గెలుస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం శాసనసభ్యులు ముత్తుకూరు మండల కేంద్రంలో పర్యటించారు. మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ సీనియర్ నాయకులు తో పాటు ప్రభుత్వ అధికారులు విచ్చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో జల్ జీవన్ పథకం ద్వారా పూర్తయిన త్రాగునీటి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో విబిజి రాంజీ పథకం ద్వారా నిర్మాణం కానున్న సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు అరాచకాలు జరిగాయి అన్నారు. అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. అన్ని స్థానాలు గెలిచి తీరాలని తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సూచించారు. కూటమి ప్రభుత్వ పరిపాలనలో బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. 34 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఇస్తున్నామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు