చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్
ద్వారకాతిరుమల మేజర్ న్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పై అమావాస్య ప్రభావం కనిపిస్తుంది. స్వామివారికి ప్రీతికరమైన శనివారం రోజున అమావాస్య కారణంగా భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించారు. దీంతో భక్తులకు ఉచిత దర్శనం గంటలోనే ముగిసింది. స్వామివారిని ఎక్కువ సమయం చూస్తూ దర్శనం చేసుకున్నామని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీవారి నిత్య అన్నదానంలో సుమారు 7000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి త్రినాధరావు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు.
రిపోర్టర్ నాగరాజు ద్వారకతిరుమల ఏలూరు జిల్లా,