BREAKING
దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు డివిస్ కంపెనీల ఉద్యోగాలు సాధించిన ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జగ్గయ్యపేట అభివృద్ధికి రూ.15 కోట్లతో HAM గ్రాంటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఫెలో ల్యాండ్ కి ఆర్డీఎస్ కిట్స్ సిద్దం : వ్యవసాయ శాఖ ఏఓ మజ్జి చెయ్యరులో కనకదుర్గమ్మ ఆలయ వివాదం.. నవరాత్రి పూజలకు అడ్డంకి మనస్థాపంతో వ్యక్తి అదృశ్యం

కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే

Select Suryaa Now
కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీ ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వరి కోదండ రామస్వామి దేవస్థానంలో ఈనెల 11వ తేదీ నుంచి 20వతేదీ వరకు దసరా పండుగ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆర్యవైశ్య సంఘం, ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు గావించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించడంతోపాటు ప్రధాన వీధుల్లో కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులు డి.లక్ష్మణమూర్తి, సిహెచ్ సుధీర్ బాబు, పరిటాల వెంకట సత్యనారాయణ, పి.శరత్ బాబు, ఎస్ కిరణ్ కుమార్, కె.సురేష్ బాబు, రాజా వెంకటేష్, ఎం హరికృష్ణ,నున్న సంతోష్ కుమార్, ఆర్. సత్యనారాయణ, ఏ.వీ. రాము,సిహెచ్.తరుణ్, జి. వెంకటేశ్వర్లు, డి. శ్రీనివాసులు, శ్రీరాం శీను, టీ. చిన్న బాబు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిన్ని సుధీర్ బాబు, కార్యదర్శి సోమిశెట్టి కిరణ్ కుమార్, కోశాధికారి కొలిశెట్టి చంద్రమోహన్, ఆలయ చైర్మన్ దోర్నాదుల సురేష్ బాబు, కార్యదర్శి పొన్నూరు హాజరత్తయ్య, కోశాధికారి మద్దాలి సతీష్ కుమార్ ఉత్సవ ఏర్పాట్లను ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయించారు. ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిగేలా ఏర్పాట్లు గావించారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు,ప్రత్యేక అలంకారాలు నిర్వహించనున్నారు. ఈనెల 11వ తేదీ ఆదివారం మండపారాధన కలశ స్థాపన లోకా వెంకట సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సాయంత్రం 7:00 నుండి 8:00 వరకు అమ్మవారికి సహస్ర నామార్చనతోటి కుంకుమ పూజ జరగనుంది. తొలి రోజైన ఆదివారం కలసి స్థాపన, అమ్మవారికి భువనేశ్వరి అలంకారం నిర్వహించనున్నారు. 12వ తేదీ అమ్మవారికు అన్నపూర్ణ అలంకారం, 13వ తేదీ ధనలక్ష్మి అలంకారం, 14వ తేదీ రాజరాజేశ్వరి అలంకారం, 15వ తేదీ గజలక్ష్మి అలంకారం, 16వ తేదీ సరస్వతి అలంకారం, 17వ తేదీ గాయత్రి అలంకారం, 18 వ తేదీ దుర్గాష్టమి దుర్గాదేవి అలంకారం,19వ తేదీ మహార్నవమి మహిషాసుర మర్థిని అలంకారం, 20వ తేదీ విజయదశమి కన్యకా పరమేశ్వరి అలంకారంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తొలిరోజు ఆదివారం కలశ స్టాపన సందర్భంగా 108 కళాశాలతో ఉదయం 9 గంటలకు శ్రీ ఆర్యవైశ్య మహిళలు పోలేరమ్మ గుడి వద్ద నుండి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో బయలుదేరి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరుగు కలశ స్తాపన కార్యక్రమంలో పాల్గొంటారు. భక్తుల కాలక్షేపం కోసం ఈనెల 12వ తేదీ కూచిపూడి నృత్య ప్రదర్శన, 13వ తేదీ శివపార్వతుల కళ్యాణం, 15వ తేదీ పల్లకి సేవ నిర్వహించనున్నారు. ఈనెల 16వ తేదీ సరస్వతి అలంకారం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవ కమిటీ వారిచే పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతీ ప్రధానం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల పర్యవేక్షణలో జరుగనున్నాయి. ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని సందర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ, ఆర్యవైశ్య కమిటీ ప్రతినిధులు కోరారు.