BREAKING
అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు డివిస్ కంపెనీల ఉద్యోగాలు సాధించిన ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జగ్గయ్యపేట అభివృద్ధికి రూ.15 కోట్లతో HAM గ్రాంటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఫెలో ల్యాండ్ కి ఆర్డీఎస్ కిట్స్ సిద్దం : వ్యవసాయ శాఖ ఏఓ మజ్జి చెయ్యరులో కనకదుర్గమ్మ ఆలయ వివాదం.. నవరాత్రి పూజలకు అడ్డంకి మనస్థాపంతో వ్యక్తి అదృశ్యం అణచివేతతో మమ్మల్ని ఆపలేరు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేస్తాం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...!

Select Suryaa Now
డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...!

డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...!

????436 అడుగుల ఎత్తులోనే కాలువ నిర్మించాలి

????మునుగోడులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన డిండి ఎత్తిపోతల సాధన సమితి డిమాండ్

మునుగోడు,మేజర్ న్యూస్:

డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల (వీరాంజనేయ) జలాశయం నుంచే నీటిని అందించాలని డిండి ఎత్తిపోతల పథక సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి మునుగోడు చౌరస్తాలో రైతులు, ప్రజలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి కాలువతో సమానంగా డిండి కాలువను కూడా 436 అడుగుల ఎత్తులో నిర్మించాలని కోరారు. 440 అడుగుల ఎత్తు ప్రతిపాదనతో భవిష్యత్తులో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ప్రాజెక్టుల సమీక్షలో నల్గొండ జిల్లా ప్రజల నీటి అవసరాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సమితి హెచ్చరించింది. 
ఈ కార్యక్రమంలో జల సాధన సమితి నాయకులు మారగోని అంజయ్య,మేకల శ్రీనివాస్ రెడ్డి,పోలగోని సైదులు, అయితగోని విజయ్,సోలిపురం సర్పంచ్ నకిరేకంటి మురళీకృష్ణ గౌడ్, జిట్టగోని మల్లేష్, గురిజా సునీల్, గుర్రాల సురేష్, కొమ్ము మల్లేష్, ఎంపల్ల పరమేశ్,జిల్లా సుఖేందర్,గజ్జల బాలరాజు, సురిగి రవి, బుడిగ స్వామి, గురజాల శ్రవణ్, ధాం నరసింహ, బైరు నరేష్, ఇరిగి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.