మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి
సీతమ్మధార, సూర్య : నేటి నుండి పద్మ పూజిత వీల్స్ స్మార్ట్ సంస్థ ఆధ్వర్యంలో మెగా దసరా మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ అధినేత బసవరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వీల్స్ మార్ట్ సంస్థ ఆధ్వర్యంలో పలు ఆఫర్లతో ప్రజలకు నాణ్యమైన ధరలతో కూడిన టు వీలర్ బైక్ పలు ఆఫర్లతో అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రతి టూ వీలర్ బైక్ పై 2994 విలువైన బహుమతులు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మొదటి ప్రైజ్ గా సుమారు 25 మందికి 25 వేల రూపాయల విలువచేసే స్మార్ట్ ఫోన్స్ రెండవ ప్రైజ్ గా 13 వేల రూపాయలు విలువచేసే రిఫ్రిజిరేటర్ 25 మందికి మూడవ బహుమతిగా 3500 రూపాయలు విలువచేసే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి టూ వీలర్ కొనుగోలుపై సర్వీస్ కూడా అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పై కొనుగోలు, అమ్మకం, ఎక్స్చేంజ్ ,ఫైనాన్స్, సర్వీస్, కొనుగోలుదారుడికి సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం దసరా మేళా నిర్వహిస్తున్నట్లు అదే విధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈనెల 27వ తేదీన లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందని సుమారు 75 లక్షల రూపాయల విలువ గల బహుమతులను అందించడం జరుగుతుందని ఆయనకు తెలిపారు. విశాఖ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని ఆయన కోరారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.