నేటి నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ : ఇంకొల్లు శ్రీ వాసవీకన్యకాపరమేశ్వరి అమ్మవారి వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నుండి ఈనెల 20వ తేదీ వరకు శ్రీ దేవీ శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు బెల్లంకొండ వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. తొమ్మిది రోజులపాటు వివిధ అలంకరణల్లో అమ్మవారిని అందంగా అలంకరిస్తామన్నారు. నవరాత్రి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వాసుదేవరావు కోరారు.