BREAKING
కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు డివిస్ కంపెనీల ఉద్యోగాలు సాధించిన ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జగ్గయ్యపేట అభివృద్ధికి రూ.15 కోట్లతో HAM గ్రాంటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఫెలో ల్యాండ్ కి ఆర్డీఎస్ కిట్స్ సిద్దం : వ్యవసాయ శాఖ ఏఓ మజ్జి చెయ్యరులో కనకదుర్గమ్మ ఆలయ వివాదం.. నవరాత్రి పూజలకు అడ్డంకి మనస్థాపంతో వ్యక్తి అదృశ్యం అణచివేతతో మమ్మల్ని ఆపలేరు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేస్తాం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యం ఎలికట్ట ఆలయం...

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

Select Suryaa Now
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అన్నారు. మహాలయ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులపాటు వైభవంగా నిర్వహించి, సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ ఉత్సవాలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా శనివారం వికాస్ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాటలు, సంబరాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. నేడు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడటం గర్వకారణమన్నారు. సాధారణంగా పూలతో భగవంతుడిని పూజిస్తామని, బతుకమ్మ పండుగలో పూలనే దైవ స్వరూపంగా భావించి ఆరాధిస్తామని వివరించారు. ప్రకృతి ప్రసాదించిన పూలు పర్యావరణ పరిరక్షణలోనూ, నీటి శుద్ధిలోనూ ప్రాధాన్యత కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.కళాశాల స్థాపించిన నాటి నుంచి గత 26 సంవత్సరాలుగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అందించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినులు బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ వేడుకల్లో మహిళా అధ్యాపకులు ఉమారాణి, వరలక్ష్మి, వనితతో పాటు అధ్యాపకులు ప్రభాకర్ రెడ్డి, రామచంద్రయ్య, నర్సింహులు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.