telanagana
సుధాకర్ మృతుకపోలీసుల వైఫల్యమే.
సూర్య నిజామాబాద్ క్రైమ్:భీంగల్‌లో హోటల్ నిర్వహిస్తున్న వ్యక్తి పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మృతిచెందిన ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ ఓబీసీ మోర్చా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి వేణుగోపాల్‌ను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.ఈ సందర్భంగా వేణుగోపాల్ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. హోటల్ నిర్వాహకుడి మృతికి పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపిస్తూ, బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల ఒత్తిళ్లు, వేధింపులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన తమను అడ్డుకోవడం, ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం సమంజసం కాదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని వేణుగోపాల్‌ను అక్కడి నుంచి తరలించారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.