పిచ్చికుక్క సైర విహారం రెండేళ్ళ బాలుడితో సహా ఆరుగురికి గాయాలు
చీపురుపల్లి మేజర్ న్యూస్:
కుక్క స్వైరవిహారం చేయడంతో ఆరుగురు తీవ్రంగ గాయపడ్డారు. కాగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరిచి వెళ్లిపోయినట్టు వారు తెలిపారు. పట్టణంలోని దేవాంగుల వీధిలో సోమవారం రాత్రి సమయంలో వీధిలో తన ఇంటి ముందు ఉన్న వాకిట్లో నిలబడిన వ్యక్తిని మొదట పిచ్చి కుక్క కరిచింది. వెంటనే అతను తమ్ముడు కుక్కను కొట్టబోతే అది అతని చెయ్యి మీద కరిసింది. వెంటనే కుటుంబ సభ్యులు బయటకు రావడంతో వాళ్ళ అందరిపై విరుచుకుపడింది. నలుగురిని కరిచి గాయపరిచి అక్కడ నుంచి పారిపోయింది. స్థానికులు వచ్చి వెంబడించిన అది రైల్వే ట్రాక్ పైనుంచి చీకట్లోకి వెళ్లిపోయింది. గాయపడిన వాళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినవారు. పండిత సంతోష్ కుమార్ అతని భార్య విష్ణుప్రియా, అత్తయ్య కళ్యాణి కాళీ, గోవర్ధన్ చెయ్యి మొత్తం చీరేసింది. అలగే విక్టరీ లే అవుట్ లో గృహ సముదాయం వద్ద సుమారు రెండేళ్ల బాలుడిని, అడ్డగించిన వ్యక్తిని కూడా కరిచి వెళ్లిపోయినట్టు వారు తెలిపారు. కాగా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫర్ చేయడంపై బాధితులు మండి పడుతున్నారు. కుక్క కరిస్తే వైద్యం కూడా చేయరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.